![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌజ్ లో ఆరవ వారం కూడా మరో అమ్మాయి ఎలిమినేట్ అయి బయకొచ్చింది. పోటుగాళ్ళుగా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్, అశ్విని, నయని, పూజా మూర్తి, భోలే శావలి నుండి నయని పావని ఎలిమినేట్ అయింది.
ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన నయని మోస్ట్ ఎమోషనల్ అయింది. ఇక నాగార్జున తన జర్నీ వీడియో చూపించి, తర్వాత హౌజ్ మేట్స్ తో మాట్లాడించాడు. ఇక ఒక్కో హౌజ్ మేట్ గురించి మాట్లాడుతూ నయని ఏమోషనల్ అయింది. శోభా శెట్టి చాలా స్వీట్ అండ్ స్ట్రాంగ్ అని నయని అంది. ప్రియాంక ఎంతో ఓపికగా అందరికి వండిపెడుతుంది. అందరు తినాలని ఎప్పుడు ఉంటుంది. షీ ఈజ్ స్వీట్ అని అంది. అమర్ దీప్ నా ఫస్ట్ మూవీ హీరో, నేను అతని హీరోయిన్. అతనిలో ఫైర్ ఉంది. కానీ బయపడుతున్నాడు. గేమ్ బాగా ఆడు అమర్, తడపడకు చుట్టూ చూడకు సూటిగా ఆడు అని అమర్ దీప్ కి నయని చెప్పింది.
తేజ చాలా మంచోడు సర్. నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తాడు. తిన్నావా తిన్నావా అని ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. నవ్వించాలని ట్రై చేస్తాడు. అలా నయని అనగానే.. నథింగ్ పర్సనల్ , మిస్ యూ రా అని తేజ అన్నాడు. పూజ చాలా మంచిది. మా అక్క తర్వాత తనే నాకు బాగా కనెక్ట్ అయింది. మాట్లాడటానికి అందరు క్లోజ్ అయ్యారని నయని అనగా.. బయటకొచ్చిన తర్వాత కలుద్దామని నయని అంది. ఆట సందీప్.. చాలా కూల్ గా ఉంటాడు.
బయటకొచ్చాక మనమిద్దరం డ్యాన్స్ చేద్దామని అంది నయని. అంబటి అర్జున్.. ఎప్పుడు స్వీట్ అండ్ ఫేస్ లో నవ్వు ఉంటుంది మా టీమ్ కి ఒక లీడర్ ఉన్నాడని నయని అనగా.. "ఈ వీక్ మొత్తంలో యాక్టివ్ గా ఉంది నయని. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకు. బయటకొచ్చాక ఫస్ట్ నిన్నే కలిసేది" అని అంబటి అర్జున్ అన్నాడు. గౌతమ్ కృష్ణ.. డాక్టర్ బాబు ప్రతీది నవ్వుతూ తీసుకుంటాడు. చాలా కూల్ అండ్ కామ్ అని నయని అంది. పల్లవి ప్రశాంత్.. చాలా జెన్యున్ ప్లేయర్. ఆట కోసం ఎంతైనా కష్టపడతాడని నయని అనగా.. అదేంటి వెళ్తున్నావా లేదు వెళ్ళవ్ నెక్స్ట్ నామినేషన్లో మనం కొట్టుకోవద్దా, నీ కోసం చాక్లెట్లు దాచానని పల్లవి ప్రశాంత్ అంటాడు. నయని పావని ఏడ్చేస్తుంది.
శివాజీ గురించి మాట్లాడుతూ చాలా ఏడ్చేసింది నయని. "శివాజీ గారిని చూడగానే నాకు మా నాన్నే గుర్తొచ్చాడు సర్. రోజు పొద్దున్నే వెళ్ళి డాడీకి హగ్ ఇచ్చి నా డే స్టార్ట్ చేస్తాను సర్" అని నాగార్జునతో నయని అంది. ఐ మిస్ యూ డాడీ అని శివాజీతో నయని అనగానే శివాజీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక శివాజీ ఎమోషనల్ అవుతూ.. " నాకు కూతురు లేదు సర్. తనలో నేను కూతురిని చూసుకున్నాను. నన్నే డాడీ అనుకో అని తనతో చెప్పాను. సర్ తన బదులు నేను బయటకు రావొచ్చా సర్. నాకు చేయి నొప్పి కూడా ఉంది " అంటూ శివాజీ ఎమోషనల్ గా చెప్పగా.. ఆడియన్స్ ఓటింగ్ ని మనం మార్చలేం కదా శివాజీ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత నయని పావని ఎలిమినేషన్ అయి బయటకి వెళ్లింది. ఇక నాగార్జున చూసి ఒక కంటెస్టెంట్స్ బయటకు వెళ్తుంటే ఇంతమంది బాధపడటం ఫస్ట్ టైమ్ చూస్తున్నానని నాగార్జున అన్నాడు.
![]() |
![]() |